Friday, December 17, 2010

రామ నీల మేఘ శ్యామ(rama neela megha shyama)

జయతు జయతు మంత్రం
జన్మ సాపల్య మంత్రం
రామ్ రామ్ రామ్

జనన మరణ దీధక్లేశ

విచ్చెద మంత్రం
రామ్ రామ్ రామ్

సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం

రఘుపతి నిజ మంత్రం
రామ రామనేటి మంత్రం

రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)

నీల మేఘ శ్యామ

రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (2)


తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే (2)

ధరణిజెల్ల పాలనా చేసే పరం జ్యోతివే
దాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా (2)

తెలియ తరమా? పలుక వశమా?

నీదు మహిమా రాఘవ

రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)

నీల మేఘ శ్యామ

రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము(2)

కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము

నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య(2)


నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ


రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)

నీల మేఘ శ్యామ

రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (3)


No comments:

Post a Comment