Thursday, April 15, 2010

Neeli Megham nee lokam (నీలి మేఘం నీ లోకం)

నీలి మేఘం నీ లోకం
నేల మూలాలు నా జగం
వేల మెరుపులు నీ సొంతం
వీలు కాదది పొందటం
జల్లై నీలి మేఘం నేల వడిలో చేరదా?
నీలో విరుపుకైనా దారి చూసే వీలుందా?

ఏమి అర్ధం కాని గుండె అద్దంలోని ఆశలేవో చూస్తున్నా
తేన కేరటాలున్న పాల సంద్రం ముందు ఈత రాదని అంటున్నా

నీలి మేఘం నీ లోకం
నేల మూలాలు నా జగం

బంగారంలా నవ్వే బొమ్మని, బొమ్మని చూసామని
సంతోషంతో తుల్లే కళ్లకి వేసెదేలా సంకెల్లని?

రెప్ప సంకెల్లు వెయ్యాలి అనుకున్నా
స్వప్న లోకంలో సందల్లు ఆగేనా?
స్వప్నం సత్యంగా ఇంకింత దగ్గరైన, దూరం అవుతావా తాకేంత వీలున్నా?

కోనేటిపై చందమామని చేయి తాకితే అది అందునా?
అరచేతిపై వున్నా గీతని చేయి తాకదా అవునా?

ఏమి అర్ధం కాని గుండె అద్దంలోని ఆశలేవో చూస్తున్నా
తేన కేరటాలున్న పాల సంద్రం ముందు ఈత రాదని అంటున్నా

తీరం నుండి ఎంతో హాయిగా కనిపించవా నది వంపులు
తీరం దాటామంటే మాయగా ముసిరేయ్యవా మరి ముంపులు
ఎంతో పంచేటి ఉదేశం వున్న మదికి
దేన్నీ ముంచేటి ఆవేశం రాదేన్నటికి

ఏదో అందించే ఆరాటంలోన వుంటే రారా రమంటూ ఆహ్వానం అందునంతే
చిరుగాలిని చిన్న దోసిలు బందిచదే ఓ ప్రాణమా?
నీ శ్వాశ లో కలిపేసుకో విడదీయటం తరమా?

ఏమి అర్ధం కాని గుండె అద్దంలోని ఆశలేవో చూస్తున్నా
తేన కేరటాలున్న పాల సంద్రం ముందు ఈత రాదని అంటున్నా

నీలి మేఘం నీ లోకం
నేల మూలాలు నా జగం
వేల మెరుపులు నీ సొంతం
వీలు కాదది పొందటం

No comments:

Post a Comment