Tuesday, May 18, 2010

Sundharamo Sumadhuramo (సుందరమో సుమధురమో)

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో(2)
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

ఆనందాలే భోగాలైతే, హంసా నంది రాగాలితే
నవ వసంత గానలేవో సాగేనులే, సుర వీణ నాదలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోణాలలో మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లుదిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగామమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

Monday, May 17, 2010

Pattubatta Radhu (పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు)

పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు
పట్టెనేని బిగియబట్టవలయు
పట్టు విడుటకన్న, బరగజచ్చుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ!

ఏ పనినైనా మొదలు పెడితే, చివరివరుకు పట్టుదలతో చేయాలి. పట్టువదలడం కంటే ప్రాణము వదలడం మేలు.

Monday, May 10, 2010

Madhurame Madhurame (మధురమే మధురమే మధురమే)

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నా కోసం వస్తే మధురమే ఆఆ
నన్నే తడిపేస్తే మధురమే

నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నా కోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నా కోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
యతి లేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ సూన్యం అయినా మధురమే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమలమేంతో మధురమే
చెలి నదిచే దారుల్లో మట్టిని తాకినా మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమలమేంతో మధురమే
చెలి నదిచే దారుల్లో మట్టిని తాకినా మధురమే
ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయ్యంతా వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కన్ను రాల్చే ఆ కన్నేరైనా మధురమే మధురమే

I am in Love

#I am in Love I am in Love I am in Love with u#
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నెల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం, తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం, నిను చేరడం కొరకే

కోటి కలలను గుండెలోతులు దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగా నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి
నే నీటి చుక్కై పోవాలి
నవ్వేటి సింగారి వెల్లోద్దె చేజారి
నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై, చిరుజల్లు నేనై
నిన్ను నేను చేరుకుంటే హాయి
నిన్ను నేను చేరుకుంటే హాయి

నీవు ఎదురుగా నిలచి ఉండగ
మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగా నువ్వు తాకగా మధువు సోకేను మనసుని
నే చెంత చేరాలి, స్వర్గాన్నే చూడాలి
నే నీలో నిండిపోవాలి
నీ కంటి చూపుల్లో
నీ ప్రేమ వానల్లో
నిలువెల్లా నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైనా నీకే అంకితమవ్వని
నీకే అంకితమవ్వని

Sunday, May 9, 2010

Evaru Raayagalaru (ఎవరు రాయగలరు)

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం

అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా.. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం

శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
నూరేళ్ళు..నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్నా బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం

Tuesday, May 4, 2010

Eppudu oppukovaddu ootami (ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి)

ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా!
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దైనా రివ్వుమన్న గువ్వా పిల్ల రెక్క ముందు తక్కువేను రా!
సంద్రమెంత గొప్పదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేరా!
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదు రా!
గుటకపడని అగ్గి వుందా సాగారానీదుకుంటూ తూరుపుటింట తేలుతుంది రా!
నిషా విలాసం ఎంత సేపు రా? ఉషోదయాన్ని ఎవడాపు రా!
రాగులుతున్న గుండె కూడా సూర్య గోల మంటిదేనురా!
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి

నొప్పి లేని నిమిషమేది జనన మైన మరణమైన జీవితాన అడుగడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు, బ్రతుకంటే నిత్య ఘర్షణ
దేహముంది నెత్తురుంది సత్తుంది ఇంత కన్నా సైన్యం ముండునా?
ఆశ నీకు అస్త్రమౌను
స్వశ నీకు శస్త్రమౌను
ఆశయము సారధవును రా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా!
ఆయువంటు వున్నా వరకు చావు కూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటురా
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి!!!

Pedhave Palikina (పెదవే పలికిన)

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ!
మనదైనా రూపం అమ్మ!
యెనలేని జాలి గుణమే అమ్మ!
నడిపించే దీపం అమ్మ!
కరుణించే కోపం అమ్మ!
వరమిచ్చే తీపి శాపం అమ్మ!
నా ఆలి అమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

ఆ ఆ ఆ ...
పోతిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా?
నా కొంగు పట్టేవాడు
నా కడుపునా పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలి జో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో

Enthavaraku endhukoraku (ఎంత వరకు ఎందుకొరకు)

ఎంత వరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు వుంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరు ఒక్కొక్క అలపేరు
మనకిల ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వే కదా అంటున్నది
నీ ఉపిరిలో లేదా గాలి వేలుతుతూ నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా .. కాదా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్షాలే
శత్రువులు నీలోని లోపలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
రుతువులు నీ భావ చిత్రాలే
ఎదురైనా మందహాసం నీలోని చెలిమికోసం
మోసం రోషం ద్వేషం నీ మథిలి మదికి భాష్యం
పుటకా చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ.....

Alupannadhi Vundha (అలుపన్నది వుందా)

అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు?
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?
మెలికలు తిరిగే నది నడకలకు?
మరి మరి ఊరికే మది తలపులకు?
లలా లలా లలలలా...

అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు?
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?

నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు?
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు?
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు?
కలలను తేవా నా కన్నులకు?
లలా లలా లలలలా...

అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు?
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?

నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలోని వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే తొలి ఆశలకు
లలా లలా లలలలా....

అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు?
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?
మెలికలు తిరిగే నది నడకలకు?
మరి మరి ఊరికే మది తలపులకు?
లలా లలా లలలలా....