Tuesday, May 4, 2010

Eppudu oppukovaddu ootami (ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి)

ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా!
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దైనా రివ్వుమన్న గువ్వా పిల్ల రెక్క ముందు తక్కువేను రా!
సంద్రమెంత గొప్పదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేరా!
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదు రా!
గుటకపడని అగ్గి వుందా సాగారానీదుకుంటూ తూరుపుటింట తేలుతుంది రా!
నిషా విలాసం ఎంత సేపు రా? ఉషోదయాన్ని ఎవడాపు రా!
రాగులుతున్న గుండె కూడా సూర్య గోల మంటిదేనురా!
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి

నొప్పి లేని నిమిషమేది జనన మైన మరణమైన జీవితాన అడుగడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు, బ్రతుకంటే నిత్య ఘర్షణ
దేహముంది నెత్తురుంది సత్తుంది ఇంత కన్నా సైన్యం ముండునా?
ఆశ నీకు అస్త్రమౌను
స్వశ నీకు శస్త్రమౌను
ఆశయము సారధవును రా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా!
ఆయువంటు వున్నా వరకు చావు కూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటురా
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి!!!

No comments:

Post a Comment