Tuesday, May 18, 2010

Sundharamo Sumadhuramo (సుందరమో సుమధురమో)

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో(2)
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

ఆనందాలే భోగాలైతే, హంసా నంది రాగాలితే
నవ వసంత గానలేవో సాగేనులే, సుర వీణ నాదలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోణాలలో మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లుదిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగామమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

No comments:

Post a Comment