ఆకాశాన సూర్యుడుండడు సందే వేలకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలి మూడున్నల్లె ఈ జీవ యాత్రలో
ఒక పూటలోనే రాలు పూవ్వులెన్నో
నవ్వవే నవ మల్లికా
ఆశలే అందాలుగా
యద లోతుల్లో ఒక ముళ్ళున్న
వికసించాలి ఇక రోజాలా
కన్నీటి మీద నావ సాగనేల .. (నవ్వవే)
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధు మాసంలో
తుమ్మెద జన్మకు నూరేల్లెందుకు రోజే చాలులే!!!
చింత పడే చిలిపి చిలక
చిత్రములే బ్రతుకు నడక
పుట్టే ప్రతీ మనిషి కను మూసే తీరు
మళ్లీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ.. (నవ్వవే)
నీ సిగ పాయలు నీలపు చాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు
పావురమే బయటికేగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
వున్నా కలగన్నా విడిపోదే ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట..(నవ్వవే)
.......................................
ముళ్ళును పువ్వుగా బాధను నవ్వుగా మార్చుకున్న ఈ రోజాకీ
జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే
.......................................
No comments:
Post a Comment