రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా ఎందుకమ్మా?
రాలేదు ఈ వేళ కోయిలమ్మా, రాగాలే మూగ బోయినందుకమ్మ .. (రాగాల)
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా ఎందుకమ్మా? ఎందుకమ్మా?
పిలిచినా రాగమే, పలికినా రాగమే కూనలమ్మకీ, మూగ తీగ పలికించే వీణలమ్మకి (2)
బహుశా అది తెలుసు ఏమో(2) జాణ కోయిల రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా అందుకేనా? అందుకేనా?
గుండెలో భాదలే గొంతులో పాటలై పలికినప్పుడు, కంటి పాప గాలికి లాలి పాడినప్పుడు(2)
బహుశా తను ఎందుకనేమో(2) గడుసు కోయిల రాలేదు తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రానేల నీవుంటే కూనలమ్మా(2)
No comments:
Post a Comment