సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రొజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ .. (సంతోషం)
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా ( 2 )
చుట్టమల్లె కష్టమొస్తే కాళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మినుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ
ఆసలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా( 2 )
నిన్న రాత్రి పీడ కల నేడు తలచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనే వుంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తేలివమ్మా
కలతలన్నీ నీ కిల కిలతో తరిమేయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ .. (సంతోషం)
No comments:
Post a Comment