Thursday, July 29, 2010

Priyatamaa na hrudayama (ప్రియతమా నా హృదయమా)

ప్రియతమా నా హృదయమా (2)
ప్రేమకే ప్రతిరూపమా (2)
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసినా త్యాగమా .. (ప్రియతమా)

శిలలాంటి నాకు జీవాన్ని పోసి

కలలాంటి బతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
యదలోని సెగలు అడుగంట మాపి
నులి వెచ్చనైన ఓదార్పు నీవై
శ్రుతి లయ లాగా జతచేరినావు
నువులేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ .. (ప్రియతమా)

నీ పెదవి పైనా వెలుగారనీకు

నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైనా మూడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమ .. (ప్రియతమా)

No comments:

Post a Comment