దినదినము వర్ధిల్లు తెలుగు దేశం
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం
తెనెకన్నా తియనిది తెలుగు భాష(2)
దేశ భాషలందు లెస్స తెలుగు భాష(2)
తెనెకన్నా తియనిది తెలుగు భాష
ఓ ఓ ఓ
భామల్లారా తుమ్మెద
మామ నవ్వులలర తుమ్మెద
హంసల్లు చిలకలు తుమ్మెద
హంసల్లు చిలకలు తుమ్మెద
ఆకాశ మందగిరి తుమ్మెద
గువ్వాళ్ళు పిచుకళ్ళు తుమ్మెద
గుడి చుట్టూ తిరిగాయి తుమ్మెద
కొలనులో తామరలు తుమ్మెద
కోరి వికసించాయి తుమ్మెద
ఓ ఓ ఓ
మయురాల వయారాలు మాటలలో పురివిప్పులు
పావురాల కువకువలు పలుకులందు వినవించును .. (మయురాల)
సప్త స్వరనాద సుధలు
నవ రస భావాల మణులు .. (సప్త స్వరనాద)
చారు తెనుగు సొగసులోన జాలువారు జాతీయం
తెనెకన్నా తియనిది తెలుగు భాష
దేశ భాషలందు లెస్స తెలుగు భాష
తెనెకన్నా తియనిది తెలుగు భాష
అమరావతి సీమలో కమనీయ శీలా మంజరి
రామప్ప గుడి గోడల రమణీయ కళా రంజని .. (అమరావతి సీమలో)
అన్నమయ్య సంకీర్తనం
క్షేత్రయ్య శృంగారం .. (అన్నమయ్య)
త్యాగరాజు రాగ మధువు
తెలుగు సామ గానమయం
తెనెకన్నా తియనిది తెలుగు భాష(2)
దేశ భాషలందు లెస్స తెలుగు భాష(2)
తెనెకన్నా తియనిది తెలుగు భాష
No comments:
Post a Comment