Tuesday, August 3, 2010

Ivvu Ivvu okka (ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు)

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు .. (ఇవ్వు ఇవ్వు)
వద్దు వద్దు అంటుపోతే చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నె ముద్దు ఇచుకుంటే చిన్నవాడ పెళ్లి దాక ఆగవంట
కళ్ళతోటి పెళ్లైంది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఇవ్వలేంది అడగవద్దు (2)

ఆద్యంతము లేని అమరానందమే ప్రేమ
ఏ బంధుము లేని తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్య భావము
ప్రేమ దైవ రూపము
ప్రేమ జీవ రాగము
ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవి లేనిది అందమైన ప్రేమ .. (ఇవ్వు ఇవ్వు)

ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతీ రోజు నీ ఉదయాన్ని నేను
ప్రతీ రెయి నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే!!! .. (ఇవ్వు ఇవ్వు)

No comments:

Post a Comment