Monday, August 9, 2010

Nemaliki nerpina (నెమలికి నేర్పిన)

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడాలి నా నాట్య లీల .. (నెమలికి నేర్పిన)
నెమలికి నేర్పిన నడకలివి

కలహంసలకిచ్చిన పదగతులు
ఏల కోయిల మెచ్చిన స్వరజతులు .. (కలహంసలకిచ్చిన)
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవో కన్నుల కిన్నెరలు .. (ఎన్నెన్నో వన్నెల)
కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా
వల్ప శిల్పమని నే కలను శకుంతలను .. (నెమలికి నేర్పిన)

చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు .. (చిరునవ్వులు అభినవ)
నీలాల కన్నుల్లో తారకలు
తారాడే చూపుల్లో చంద్రికలు .. (నీలాల కన్నుల్లో)
కురులు విరిసి మరులు కురిసి మురిన రవి వర్మ చిత్ర లేఖన
లెచ సరస సౌందర్య రేఖను శశిరేఖను .. (నెమలికి నేర్పిన)

No comments:

Post a Comment