Saturday, November 27, 2010

Pilichina Muraliki (పిలిచిన మురళికి)

పిలిచిన మురళికి, వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనంద భైరవి రాగం
మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమప రాగం
మది ఆనంద భైరవి రాగం

కులికే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే .. (2)
మనసే మురళి ఆలాపనలో మధురా నగరిగా తోచే
యమునా నదిలా పొంగినది
స్వరమే వరమై సంగమమై

మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమప రాగం
మది ఆనంద భైరవి రాగం
పిలిచిన మురళికి, వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనంద భైరవి రాగం

ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే
హృదయం లయమై పోయినది
లయలే ప్రియమై జీవితమై

మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమప రాగం
మది ఆనంద భైరవి రాగం
పిలిచిన మురళికి, వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనంద భైరవి రాగం

Manasaa Vaachaa (మనసా వాచా)

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వాసమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా
తెల్లరైనా పున్నమికన్నా
మూగైపోయా నేనిలా .. (మనసా వాచా)

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా .. (మనసా వాచా)

Rama Chakkani Seethaki (రామ చక్కని సీతకి)

నీల గగనా గనవి చలనా ధరనిజా శ్రీ రామనా
మధుర వదనా నలిన నాయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగోడంటా?
రామ చక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలీ చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునాడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే .. మనసు మాటలు కాదుగా!

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగోడంటా
రామ చక్కని సీతకి
ఇందువదన కుందరదనా మందగమనా భామా
ఎందువలనా ఇందువదనా ఇంత మదనా .. ప్రేమా??

Repalliya yedha (రేపల్లియ ఎద)

రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆనందన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)

కాలింది మడుగునా కాళీయుని పడగల
ఆ బాల గోపాల మా బాల గోపాలుని .. (కాలింది)
అ చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ .. (2)
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

ఆ ఆ
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి .. (అనగల రాగమై)
జీవన రాగమై బృందావన గీతమై .. (2)
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి

ఆ వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆనందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి.. (మధురా నగరిలో)
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై .. (2)
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)

Andhamga lena (అందంగా లేనా?)

అందంగా లేనా? అసలేం బాలేనా?
అంత level ఏంటోయ్ నీకు?
అందంగా లేనా అసలేం బాలేనా?
నీ ఈడు జోడు కాననా?
అలుసై పోయానా అసలేమి కానా?
వేషాలు చాల్లే పొమ్మనా?  (అందంగా లేనా)

కనులు కలపవాయే
మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే ..
మాట వరసకే
కలికి చిలకనాయే
కలత నిదురలాయే
మరవలేక నిన్నే మధన పడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలా 
నువ్వోచి అడగాలి అన్నట్టు 
నే బెట్టు చేశాను ఇన్నాళ్లుగా
అందంగా లేనా అసలేం బాలేనా?
నీ ఈడు జోడు కాననా?

నీకు మనసు ఇచ్చా
ఇచ్చినపుడే  నచ్చా 
కనుల కబురు తెచా తెలుసు నీకది 
తెలుగు ఆడపడుచు 
తెలుపలేదు మనసు 
మహా తెలియనట్టు నటనలేలనే
వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
తరగల్లె నురగల్లె
ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా (అందంగా లేనా)

Cheliya nilichenu (చెలియ నిలిచేను)

చెలియ నిలిచేను రుతుల గగనాన జాబిలీ అయి
చెలిమి మిగిలేను బ్రతుకు వెలిగించు సిరివెన్నెలై