రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆనందన మురళి ఇదేనా
నవరస మురళి ఆనందన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)
ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)
కాలింది మడుగునా కాళీయుని పడగల
ఆ బాల గోపాల మా బాల గోపాలుని .. (కాలింది)
అ చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ .. (2)
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
ఆ ఆ
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి .. (అనగల రాగమై)
జీవన రాగమై బృందావన గీతమై .. (2)
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
అ చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ .. (2)
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
ఆ ఆ
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి .. (అనగల రాగమై)
జీవన రాగమై బృందావన గీతమై .. (2)
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి
ఆ వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆనందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి.. (మధురా నగరిలో)
ఆ వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆనందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి.. (మధురా నగరిలో)
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై .. (2)
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)
No comments:
Post a Comment