Saturday, November 27, 2010

Manasaa Vaachaa (మనసా వాచా)

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వాసమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా
తెల్లరైనా పున్నమికన్నా
మూగైపోయా నేనిలా .. (మనసా వాచా)

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా .. (మనసా వాచా)

No comments:

Post a Comment