Saturday, November 27, 2010

Rama Chakkani Seethaki (రామ చక్కని సీతకి)

నీల గగనా గనవి చలనా ధరనిజా శ్రీ రామనా
మధుర వదనా నలిన నాయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగోడంటా?
రామ చక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి

ఎర్ర జాబిలీ చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునాడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే .. మనసు మాటలు కాదుగా!

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగోడంటా
రామ చక్కని సీతకి
ఇందువదన కుందరదనా మందగమనా భామా
ఎందువలనా ఇందువదనా ఇంత మదనా .. ప్రేమా??

No comments:

Post a Comment