Thursday, July 29, 2010

Priyatamaa na hrudayama (ప్రియతమా నా హృదయమా)

ప్రియతమా నా హృదయమా (2)
ప్రేమకే ప్రతిరూపమా (2)
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసినా త్యాగమా .. (ప్రియతమా)

శిలలాంటి నాకు జీవాన్ని పోసి

కలలాంటి బతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
యదలోని సెగలు అడుగంట మాపి
నులి వెచ్చనైన ఓదార్పు నీవై
శ్రుతి లయ లాగా జతచేరినావు
నువులేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ .. (ప్రియతమా)

నీ పెదవి పైనా వెలుగారనీకు

నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైనా మూడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమ .. (ప్రియతమా)

Raagaala Pallakilo (రాగాల పల్లకిలో)

రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా ఎందుకమ్మా?
రాలేదు ఈ వేళ కోయిలమ్మా, రాగాలే మూగ బోయినందుకమ్మ .. (రాగాల)
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా ఎందుకమ్మా? ఎందుకమ్మా?

పిలిచినా రాగమే, పలికినా రాగమే కూనలమ్మకీ, మూగ తీగ పలికించే వీణలమ్మకి (2)
బహుశా అది తెలుసు ఏమో(2) జాణ కోయిల రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా అందుకేనా? అందుకేనా?

గుండెలో భాదలే గొంతులో పాటలై పలికినప్పుడు, కంటి పాప గాలికి లాలి పాడినప్పుడు(2)
బహుశా తను ఎందుకనేమో(2) గడుసు కోయిల రాలేదు తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రానేల నీవుంటే కూనలమ్మా(2)

Wednesday, July 28, 2010

Odupunna pilupu (ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు)

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది .. (ఒడుపున్న)
అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మా (2)
నిజమేమో తెలుపు నీ మానసు తెలుపు
ఎగిరెను మన ఊరి వైపు అది పదిమంది కామాట తెలుపు .. (నిజమేమో)

గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే

ఎదలో ఏదో మాట రోధలో ఏదో పాట
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే

అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే గట్టుమీన రెళ్ళు పువ్వా బిటులికిపడుతుంటే (2)
ఎటిమార లంకలోన ఏటవాలు దొంకలోన (2)
వల్లంగి పిట్ట పల్లకిలోన చల్లంగ మెల్లంగ ఊగుతుంటే
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే

Raalipoye puvva (రాలి పోయే పువ్వా)

రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలినీ తోడు లేడులే
వాలి పోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకామేన్నడో చీకటాఎలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం .. (రాలి పోయే)

చెదిరింది నీ గూడు గాలిగా, చిలకా గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా, మనసూ మంగల్యాలు జారగా
సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై, ఆశలకే హారతివై .. (రాలి పోయే)

అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పొయే ఆ ఆ
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పొయే
పగిలే ఆకాశము నీవై, జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై, తీగ తెగే వీనియవై .. (రాలి పోయే)

Chirunavvutho (చిరునవ్వుతో)

గతమన్నది గతమేనురా వ్యధ చెందకు విలపించకు
విధిరాతలో కష్టాలకు కడ ఏదిరా దుక్కించకు
తల రాతనే ఎదిరించారా చిరునవ్వుతో చిరునవ్వుతో
మున్ముందుకే అడుగేయ్యరా చిరునవ్వుతో చిరునవ్వుతో

Samajavaragamana (సామజవరగమనా)

సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లాలన .. సామజవరగమనా
కరుణ కరిగి భువికి దిగేనా .. సామజవరగమనా
బ్రతుకు వెలిగే తరుణీ వలన .. సామజవరగమనా
చెలిమి కలిమి మరువ గలనా .. సామజవరగమనా .. (దివిని తిరుగు)

అరవిరిసిన చిరునగవుల .. సామజవరగమనా
ఇలకురిసేను సిరివెలుగులు .. సామజవరగమనా ..(అరవిరిసిన)
సొగసులమని నిగనిగమని .. సామజవరగమనా
మెరిసిన గని మురిసేను మది .. సామజవరగమనా
వెలసెను వలపుల మధువని .. సామజవరగమనా .. (దివిని తిరుగు)

మమతల ఉలి మలచిన కళ .. సామజవరగమనా
తలుకుమనేను చెలి కులుకుల .. సామజవరగమనా ..(మమతల ఉలి)
సుగునములను తరగని ఘని .. సామజవరగమనా
దొరికిందని ఎగసేను మది .. సామజవరగమనా
అరుదగు వరమిది తనదని .. సామజవరగమనా .... (దివిని తిరుగు)
చెలిమి కలిమి మరువ గలనా( 4 )

Santhosham Sagam Balam (సంతోషం సగం బలం)

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రొజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ .. (సంతోషం)

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా ( 2 )
చుట్టమల్లె కష్టమొస్తే కాళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మినుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఓహో హో హో ఓహో ఓ ఓ


ఆసలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా( 2 )
నిన్న రాత్రి పీడ కల నేడు తలచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనే వుంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తేలివమ్మా
కలతలన్నీ నీ కిల కిలతో తరిమేయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ
.. (సంతోషం)

Amrutham (అమృతం)

అయ్యోలు హమ్మోలు ఇంతేనా బ్రతుకు హు హు
ఆహాలు ఒహ్హొలు ఉంటాయి వెతుకు హ హ హ

మన చేతిలోనే లేదా రిమోట్ కంట్రోలు
ఇట్టే మర్చేదాము ఏడుపుగొట్టు ప్రోగ్రంసు

వార్తల్లో హెడ్లైసా మనకొచ్చే చిలిపి కష్టాలు
ఐఒడిన్తో అయిపోయే గాయాలే మనకి గండాలు

ఒరేయ్ ఆంజనేలు తెగ ఆయాస పడకు చాలు
మనం ఈదుతున్నా ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటు రెంటు etc మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువయితే కన్నీళ్ళు
నైట్ అంతా దోమలతో ఫైటింగ్ ఏ మనకు గ్లోబల్ వార్
హర్రిగా ఫీల్ అయ్యే టెన్షన్ లెం పడకు గోలీమార్

Aakashana Suryudu (ఆకాశాన సూర్యుడుండడు)

ఆకాశాన సూర్యుడుండడు సందే వేలకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలి మూడున్నల్లె ఈ జీవ యాత్రలో
ఒక పూటలోనే రాలు పూవ్వులెన్నో
నవ్వవే నవ మల్లికా
ఆశలే అందాలుగా
యద లోతుల్లో ఒక ముళ్ళున్న
వికసించాలి ఇక రోజాలా
కన్నీటి మీద నావ సాగనేల .. (నవ్వవే)

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధు మాసంలో
తుమ్మెద జన్మకు నూరేల్లెందుకు రోజే చాలులే!!!
చింత పడే చిలిపి చిలక
చిత్రములే బ్రతుకు నడక
పుట్టే ప్రతీ మనిషి కను మూసే తీరు
మళ్లీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ.. (నవ్వవే)

నీ సిగ పాయలు నీలపు చాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు
పావురమే బయటికేగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
వున్నా కలగన్నా విడిపోదే ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట..(నవ్వవే)
.......................................
ముళ్ళును పువ్వుగా బాధను నవ్వుగా మార్చుకున్న ఈ రోజాకీ
జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే

.......................................