Friday, December 31, 2010
తెలుగందాలే(Telugandale)
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
అమ్మడీ సిగ్గులె గుమ్మడి పువ్వులై
పిల్లడీ పల్లవే పచ్చని వెల్లువై
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే ఏ ఏ నన్ను తొంగి తొంగి చూసేనమ్మ తోలకరిగా
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
తిక్కనలో తియ్యదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం వడబోసిన నీ ప్రేమ రసం
ప్రాయానికే వేదం నవ పద్మావతీ పాదం
రాగానికే అందం రస గీత గోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సుర్యకాంత వేళ రాగ దీపికా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే ఏ ఏ నన్ను తొంగి తొంగి చూసేనమ్మ తోలకరిగా
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
క్షేత్రయలో జాణతనం వరదయ్యేనులె వలపుతనం
అందని నీ ఆడతనం అమరావతిలో శిల్పదనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఆ ఆ ఏకం కావాలిలే ఏడు జన్మల గంధాలివీ
కృష్ణవేణి జడలో శైల మల్లికా ఆ ఆ
శివుడి ఆలయాన భ్రమర దీపికా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే ఏ ఏ నన్ను తొంగి తొంగి చూసేనమ్మ తోలకరిగా
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
Wednesday, December 29, 2010
కుహు కుహు మన్నది కోకిలెందుకో(kuhukuhu mannadi kokilenduko)
తహ తహ లాడెను కొమ్మ అందుకే
కమలాల రాత్రి జపమే కుసుమించు సూర్య పుష్పం
పూజాల కలల వెలుగై ఫలియించె చంద్ర భింభం
మామ అను మమతల మౌన వేదాలతో ఓ ఓ
కుహు కుహు మన్నది కోకిలెందుకో
తహ తహ లాడెను కొమ్మ అందుకే
పారాణి సుభ పాదాలే, శివ లాస్యాల నవ నాదాలై
అలివేణి సిరి కోపాలే, ఇలనే తాకే హరి చాపలై
పరువపు విరి పాటలో, పరిమలమే పల్లవై
పయనించిన బాటలే పడుచు తోటలై
అడుగున అడుగిడు మనసులు జతపడగా
కుహు కుహు మన్నది కోకిలెందుకో
తహ తహ లాడెను కొమ్మ అందుకే
నీరూపే మదిలో దీపం, రుతురాజ్యంలో ప్రియ కార్తీకం
నీనవ్వే రజనీ గంధం చలి సందెల్లో చైత్రారంభం
మదనుడి తోలి చూపుకీ పూలకరించు మేనిలో
సవరించిన సొంపులే వలపు లేఖలై
నడుముల అలికిడి నటనకు తొలి మూడిగా .. (కుహు కుహు మన్నది కోకిలెందుకో ..)
Friday, December 17, 2010
రామ నీల మేఘ శ్యామ(rama neela megha shyama)
జన్మ సాపల్య మంత్రం
రామ్ రామ్ రామ్
జనన మరణ దీధక్లేశ
విచ్చెద మంత్రం
రామ్ రామ్ రామ్
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం
రామ రామనేటి మంత్రం
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)
నీల మేఘ శ్యామ
రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (2)
తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే (2)
ధరణిజెల్ల పాలనా చేసే పరం జ్యోతివే
దాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా (2)
తెలియ తరమా? పలుక వశమా?
నీదు మహిమా రాఘవ
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)
నీల మేఘ శ్యామ
రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము(2)
కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య(2)
నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)
నీల మేఘ శ్యామ
రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (3)
Thursday, December 9, 2010
మేఘమా ఆగలమ్మా(Meghama aagalamma)
రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు
చల్ల గాలి, మనసులో భావం నింగి దాక పయనిస్తుంది
చేరువయ్యే కను రెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది
నీతో నడవాలని (Neetho nadavaalani)
నీలో నిలవాలని ప్రాణం తపనా
నీకోసం నా అణువణువునూ వెతుకుతున్నాయనీ
నీకోసం నా అనుక్షణములో వేచివుంటాయనీ
తెలుసుకోవా తెలుసుకోవా?
తపనలోనే ఉన్నానా ఉన్నానా?
నువ్వు ఎంత కాదన్నా(Nuvvu Entha Kadanna,)
నింగి కంటే నా ప్రేమ శాశ్వతము
రుజువేలా చుపగాలను ఈ క్షణము
నం నం నా నానా నం నం న న నానా...
నా మాట తడబాటుగా మారిందా?
ఈ చోట ఏం తోచకా తిరిగిందా?
ఏమయిందీ ఏమయిందీ నా మాట ఆగింది
నా మౌనంలో తడబాటే దాగుందా?
నే చూసే నిజాములో కల ఏదో మిగిలుందా?
కలిగిందా ఆశ నాకైనా తెలియకుండా
కదిలిందా ఊహ ననైనా అడగకుండా
నే చెప్పే బదులకై నా హృదయం
వేచిందంటా !!!!
నువ్వు ఎంత దూరంగా వెళుతున్నా
నీకు అంత చేరువుగా నేనున్నా
నీడనే వేరు చేసే వీలుందా ఏ రోజైనా?
నాలాగ నే లేనని తేలింది
నీవల్లే ఈ కదలికని తెలిసింది
నీ చూపే నా వైపే అడుగేసేదేప్పుడంటా?
దూరంగా ఆనందం వేచిందా?
నా సొంతం కాకుండా దూరంగా వేలుతుందా?
నా మనసే వేవేయి దారులలో
నా అడుగే ముందడుగే వేసే ధైర్యము నే చెయ్యలేను
ఈ ప్రేమ ప్రయాణం ఇంతటితో ఆగేనేమో
Tuesday, December 7, 2010
hai hai hai vennelamma hai(హాయి హాయి హాయి హాయి)
Saturday, November 27, 2010
Pilichina Muraliki (పిలిచిన మురళికి)
అది ఆనంద భైరవి రాగం
మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమప రాగం
మది ఆనంద భైరవి రాగం
కులికే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే .. (2)
మనసే మురళి ఆలాపనలో మధురా నగరిగా తోచే
యమునా నదిలా పొంగినది
స్వరమే వరమై సంగమమై
మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమప రాగం
మది ఆనంద భైరవి రాగం
పిలిచిన మురళికి, వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనంద భైరవి రాగం
ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే
లయలే ప్రియమై జీవితమై
మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమప రాగం
మది ఆనంద భైరవి రాగం
పిలిచిన మురళికి, వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం
అది ఆనంద భైరవి రాగం
Manasaa Vaachaa (మనసా వాచా)
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వాసమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా
తెల్లరైనా పున్నమికన్నా
మూగైపోయా నేనిలా .. (మనసా వాచా)
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా .. (మనసా వాచా)
Rama Chakkani Seethaki (రామ చక్కని సీతకి)
మధుర వదనా నలిన నాయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగోడంటా?
రామ చక్కని సీతకి
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి
ఎర్ర జాబిలీ చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
చుక్కనడిగా దిక్కునాడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే .. మనసు మాటలు కాదుగా!
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగోడంటా
రామ చక్కని సీతకి
ఇందువదన కుందరదనా మందగమనా భామా
ఎందువలనా ఇందువదనా ఇంత మదనా .. ప్రేమా??
Repalliya yedha (రేపల్లియ ఎద)
నవరస మురళి ఆనందన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)
అ చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ .. (2)
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
ఆ ఆ
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి .. (అనగల రాగమై)
జీవన రాగమై బృందావన గీతమై .. (2)
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఆ వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆనందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి.. (మధురా నగరిలో)
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి .. (రేపల్లియ ఎద)
Andhamga lena (అందంగా లేనా?)
అందంగా లేనా? అసలేం బాలేనా?
అంత level ఏంటోయ్ నీకు?
అందంగా లేనా అసలేం బాలేనా?
నీ ఈడు జోడు కాననా?
అలుసై పోయానా అసలేమి కానా? వేషాలు చాల్లే పొమ్మనా? (అందంగా లేనా)
కనులు కలపవాయే
మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే .. మాట వరసకే
కలికి చిలకనాయే
కలత నిదురలాయే
మరవలేక నిన్నే మధన పడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలా నువ్వోచి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్లుగాఅందంగా లేనా అసలేం బాలేనా?
నీ ఈడు జోడు కాననా?
నీకు మనసు ఇచ్చాఇచ్చినపుడే నచ్చా కనుల కబురు తెచా తెలుసు నీకది తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలేలనేవెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్నుతరగల్లె నురగల్లెఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా (అందంగా లేనా)
Cheliya nilichenu (చెలియ నిలిచేను)
Monday, August 9, 2010
Nemaliki nerpina (నెమలికి నేర్పిన)
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడాలి నా నాట్య లీల ఆ ఆ .. (నెమలికి నేర్పిన)
నెమలికి నేర్పిన నడకలివి
కలహంసలకిచ్చిన పదగతులు
ఏల కోయిల మెచ్చిన స్వరజతులు .. (కలహంసలకిచ్చిన)
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవో కన్నుల కిన్నెరలు .. (ఎన్నెన్నో వన్నెల)
కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా
వల్ప శిల్పమని నే కలను శకుంతలను .. (నెమలికి నేర్పిన)
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు .. (చిరునవ్వులు అభినవ)
నీలాల కన్నుల్లో తారకలు
తారాడే చూపుల్లో చంద్రికలు .. (నీలాల కన్నుల్లో)
కురులు విరిసి మరులు కురిసి మురిన రవి వర్మ చిత్ర లేఖన
లెచ సరస సౌందర్య రేఖను శశిరేఖను .. (నెమలికి నేర్పిన)
Tuesday, August 3, 2010
Ivvu Ivvu okka (ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు)
ఇవ్వలేంది అడగవద్దు .. (ఇవ్వు ఇవ్వు)
వద్దు వద్దు అంటుపోతే చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నె ముద్దు ఇచుకుంటే చిన్నవాడ పెళ్లి దాక ఆగవంట
కళ్ళతోటి పెళ్లైంది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఇవ్వలేంది అడగవద్దు (2)
ఆద్యంతము లేని అమరానందమే ప్రేమ
ఏ బంధుము లేని తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్య భావము
ప్రేమ దైవ రూపము
ప్రేమ జీవ రాగము
ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవి లేనిది అందమైన ప్రేమ .. (ఇవ్వు ఇవ్వు)
ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతీ రోజు నీ ఉదయాన్ని నేను
ప్రతీ రెయి నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే!!! .. (ఇవ్వు ఇవ్వు)
Thene kanna theyyanidhi (తెనెకన్నా తియనిది తెలుగు భాష)
హంసల్లు చిలకలు తుమ్మెద
అమరావతి సీమలో కమనీయ శీలా మంజరి
Thursday, July 29, 2010
Priyatamaa na hrudayama (ప్రియతమా నా హృదయమా)
ప్రేమకే ప్రతిరూపమా (2)
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసినా త్యాగమా .. (ప్రియతమా)
శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
యదలోని సెగలు అడుగంట మాపి
నులి వెచ్చనైన ఓదార్పు నీవై
శ్రుతి లయ లాగా జతచేరినావు
నువులేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ .. (ప్రియతమా)
నీ పెదవి పైనా వెలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైనా మూడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమ .. (ప్రియతమా)
Raagaala Pallakilo (రాగాల పల్లకిలో)
రాలేదు ఈ వేళ కోయిలమ్మా, రాగాలే మూగ బోయినందుకమ్మ .. (రాగాల)
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా ఎందుకమ్మా? ఎందుకమ్మా?
పిలిచినా రాగమే, పలికినా రాగమే కూనలమ్మకీ, మూగ తీగ పలికించే వీణలమ్మకి (2)
బహుశా అది తెలుసు ఏమో(2) జాణ కోయిల రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాలేదు ఈ వేళా అందుకేనా? అందుకేనా?
గుండెలో భాదలే గొంతులో పాటలై పలికినప్పుడు, కంటి పాప గాలికి లాలి పాడినప్పుడు(2)
బహుశా తను ఎందుకనేమో(2) గడుసు కోయిల రాలేదు తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మా, రానేల నీవుంటే కూనలమ్మా(2)
Wednesday, July 28, 2010
Odupunna pilupu (ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు)
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది .. (ఒడుపున్న)
అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మా (2)
నిజమేమో తెలుపు నీ మానసు తెలుపు
ఎగిరెను మన ఊరి వైపు అది పదిమంది కామాట తెలుపు .. (నిజమేమో)
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే
ఎదలో ఏదో మాట రోధలో ఏదో పాట
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే గట్టుమీన రెళ్ళు పువ్వా బిటులికిపడుతుంటే (2)
ఎటిమార లంకలోన ఏటవాలు దొంకలోన (2)
వల్లంగి పిట్ట పల్లకిలోన చల్లంగ మెల్లంగ ఊగుతుంటే
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే
Raalipoye puvva (రాలి పోయే పువ్వా)
తోటమాలినీ తోడు లేడులే
వాలి పోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకామేన్నడో చీకటాఎలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం .. (రాలి పోయే)
చెదిరింది నీ గూడు గాలిగా, చిలకా గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా, మనసూ మంగల్యాలు జారగా
సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై, ఆశలకే హారతివై .. (రాలి పోయే)
అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పొయే ఆ ఆ
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పొయే
పగిలే ఆకాశము నీవై, జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై, తీగ తెగే వీనియవై .. (రాలి పోయే)
Chirunavvutho (చిరునవ్వుతో)
విధిరాతలో కష్టాలకు కడ ఏదిరా దుక్కించకు
తల రాతనే ఎదిరించారా చిరునవ్వుతో చిరునవ్వుతో
మున్ముందుకే అడుగేయ్యరా చిరునవ్వుతో చిరునవ్వుతో
Samajavaragamana (సామజవరగమనా)
దివిని తిరుగు మెరుపు లాలన .. సామజవరగమనా
కరుణ కరిగి భువికి దిగేనా .. సామజవరగమనా
బ్రతుకు వెలిగే తరుణీ వలన .. సామజవరగమనా
చెలిమి కలిమి మరువ గలనా .. సామజవరగమనా .. (దివిని తిరుగు)
అరవిరిసిన చిరునగవుల .. సామజవరగమనా
ఇలకురిసేను సిరివెలుగులు .. సామజవరగమనా ..(అరవిరిసిన)
సొగసులమని నిగనిగమని .. సామజవరగమనా
మెరిసిన గని మురిసేను మది .. సామజవరగమనా
వెలసెను వలపుల మధువని .. సామజవరగమనా .. (దివిని తిరుగు)
మమతల ఉలి మలచిన కళ .. సామజవరగమనా
తలుకుమనేను చెలి కులుకుల .. సామజవరగమనా ..(మమతల ఉలి)
సుగునములను తరగని ఘని .. సామజవరగమనా
దొరికిందని ఎగసేను మది .. సామజవరగమనా
అరుదగు వరమిది తనదని .. సామజవరగమనా .... (దివిని తిరుగు)
చెలిమి కలిమి మరువ గలనా( 4 )
Santhosham Sagam Balam (సంతోషం సగం బలం)
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రొజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ .. (సంతోషం)
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా ( 2 )
చుట్టమల్లె కష్టమొస్తే కాళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మినుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ
ఆసలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా( 2 )
నిన్న రాత్రి పీడ కల నేడు తలచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనే వుంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తేలివమ్మా
కలతలన్నీ నీ కిల కిలతో తరిమేయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో హో హో ఓహో ఓ ఓ .. (సంతోషం)
Amrutham (అమృతం)
అయ్యోలు హమ్మోలు ఇంతేనా బ్రతుకు హు హు
ఆహాలు ఒహ్హొలు ఉంటాయి వెతుకు హ హ హ
మన చేతిలోనే లేదా రిమోట్ కంట్రోలు
ఇట్టే మర్చేదాము ఏడుపుగొట్టు ప్రోగ్రంసు
వార్తల్లో హెడ్లైసా మనకొచ్చే చిలిపి కష్టాలు
ఐఒడిన్తో అయిపోయే గాయాలే మనకి గండాలు
ఒరేయ్ ఆంజనేలు తెగ ఆయాస పడకు చాలు
మనం ఈదుతున్నా ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటు రెంటు etc మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువయితే కన్నీళ్ళు
నైట్ అంతా దోమలతో ఫైటింగ్ ఏ మనకు గ్లోబల్ వార్
హర్రిగా ఫీల్ అయ్యే టెన్షన్ లెం పడకు గోలీమార్
Aakashana Suryudu (ఆకాశాన సూర్యుడుండడు)
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలి మూడున్నల్లె ఈ జీవ యాత్రలో
ఒక పూటలోనే రాలు పూవ్వులెన్నో
నవ్వవే నవ మల్లికా
ఆశలే అందాలుగా
యద లోతుల్లో ఒక ముళ్ళున్న
వికసించాలి ఇక రోజాలా
కన్నీటి మీద నావ సాగనేల .. (నవ్వవే)
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధు మాసంలో
తుమ్మెద జన్మకు నూరేల్లెందుకు రోజే చాలులే!!!
చింత పడే చిలిపి చిలక
చిత్రములే బ్రతుకు నడక
పుట్టే ప్రతీ మనిషి కను మూసే తీరు
మళ్లీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ.. (నవ్వవే)
నీ సిగ పాయలు నీలపు చాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు
పావురమే బయటికేగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
వున్నా కలగన్నా విడిపోదే ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట..(నవ్వవే)
.......................................
ముళ్ళును పువ్వుగా బాధను నవ్వుగా మార్చుకున్న ఈ రోజాకీ
జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే
.......................................
Tuesday, May 18, 2010
Sundharamo Sumadhuramo (సుందరమో సుమధురమో)
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో(2)
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
ఆనందాలే భోగాలైతే, హంసా నంది రాగాలితే
నవ వసంత గానలేవో సాగేనులే, సుర వీణ నాదలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోణాలలో మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లుదిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగామమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
Monday, May 17, 2010
Pattubatta Radhu (పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు)
పట్టెనేని బిగియబట్టవలయు
పట్టు విడుటకన్న, బరగజచ్చుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ!
ఏ పనినైనా మొదలు పెడితే, చివరివరుకు పట్టుదలతో చేయాలి. పట్టువదలడం కంటే ప్రాణము వదలడం మేలు.
Monday, May 10, 2010
Madhurame Madhurame (మధురమే మధురమే మధురమే)
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నా కోసం వస్తే మధురమే ఆఆ
నన్నే తడిపేస్తే మధురమే
నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నా కోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నా కోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే
యతి లేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ సూన్యం అయినా మధురమే మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమలమేంతో మధురమే
చెలి నదిచే దారుల్లో మట్టిని తాకినా మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమలమేంతో మధురమే
చెలి నదిచే దారుల్లో మట్టిని తాకినా మధురమే
ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయ్యంతా వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కన్ను రాల్చే ఆ కన్నేరైనా మధురమే మధురమే
I am in Love
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నెల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం, తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం, నిను చేరడం కొరకే
కోటి కలలను గుండెలోతులు దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగా నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి
నే నీటి చుక్కై పోవాలి
నవ్వేటి సింగారి వెల్లోద్దె చేజారి
నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై, చిరుజల్లు నేనై
నిన్ను నేను చేరుకుంటే హాయి
నిన్ను నేను చేరుకుంటే హాయి
నీవు ఎదురుగా నిలచి ఉండగ
మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగా నువ్వు తాకగా మధువు సోకేను మనసుని
నే చెంత చేరాలి, స్వర్గాన్నే చూడాలి
నే నీలో నిండిపోవాలి
నీ కంటి చూపుల్లో
నీ ప్రేమ వానల్లో
నిలువెల్లా నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైనా నీకే అంకితమవ్వని
నీకే అంకితమవ్వని
Sunday, May 9, 2010
Evaru Raayagalaru (ఎవరు రాయగలరు)
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా.. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
నూరేళ్ళు..నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్నా బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
Tuesday, May 4, 2010
Eppudu oppukovaddu ootami (ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి)
ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా!
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి
నింగి ఎంత పెద్దైనా రివ్వుమన్న గువ్వా పిల్ల రెక్క ముందు తక్కువేను రా!
సంద్రమెంత గొప్పదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేరా!
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదు రా!
గుటకపడని అగ్గి వుందా సాగారానీదుకుంటూ తూరుపుటింట తేలుతుంది రా!
నిషా విలాసం ఎంత సేపు రా? ఉషోదయాన్ని ఎవడాపు రా!
రాగులుతున్న గుండె కూడా సూర్య గోల మంటిదేనురా!
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి
నొప్పి లేని నిమిషమేది జనన మైన మరణమైన జీవితాన అడుగడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు, బ్రతుకంటే నిత్య ఘర్షణ
దేహముంది నెత్తురుంది సత్తుంది ఇంత కన్నా సైన్యం ముండునా?
ఆశ నీకు అస్త్రమౌను
స్వశ నీకు శస్త్రమౌను
ఆశయము సారధవును రా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా!
ఆయువంటు వున్నా వరకు చావు కూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటురా
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి!!!
Pedhave Palikina (పెదవే పలికిన)
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
మనలోని ప్రాణం అమ్మ!
మనదైనా రూపం అమ్మ!
యెనలేని జాలి గుణమే అమ్మ!
నడిపించే దీపం అమ్మ!
కరుణించే కోపం అమ్మ!
వరమిచ్చే తీపి శాపం అమ్మ!
నా ఆలి అమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ!
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
ఆ ఆ ఆ ...
పోతిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా?
నా కొంగు పట్టేవాడు
నా కడుపునా పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలి జో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్నా జోజో బంగారు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
Enthavaraku endhukoraku (ఎంత వరకు ఎందుకొరకు)
గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు వుంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరు ఒక్కొక్క అలపేరు
మనకిల ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వే కదా అంటున్నది
నీ ఉపిరిలో లేదా గాలి వేలుతుతూ నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా .. కాదా
మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్షాలే
శత్రువులు నీలోని లోపలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
రుతువులు నీ భావ చిత్రాలే
ఎదురైనా మందహాసం నీలోని చెలిమికోసం
మోసం రోషం ద్వేషం నీ మథిలి మదికి భాష్యం
పుటకా చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ.....
Alupannadhi Vundha (అలుపన్నది వుందా)
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?
మెలికలు తిరిగే నది నడకలకు?
మరి మరి ఊరికే మది తలపులకు?
లలా లలా లలలలా...
అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు?
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?
నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు?
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు?
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు?
కలలను తేవా నా కన్నులకు?
లలా లలా లలలలా...
అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు?
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?
నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలోని వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే తొలి ఆశలకు
లలా లలా లలలలా....
అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు?
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకు?
మెలికలు తిరిగే నది నడకలకు?
మరి మరి ఊరికే మది తలపులకు?
లలా లలా లలలలా....
Monday, April 26, 2010
Okati rendu vidiga (ఒకటి రెండంటూ విడిగా)
పక్కన నిలబెదుతూ కలుపుకుపోతుంటే అంకెలకైన అందవు సంకెలు మొత్తం ఎన్నటే;
నువ్వు నువ్వు గా నేను నేను గా ఉన్నామనుకుంటే కోట్ల ఒకట్లై ఒంటరితనాన పడి వుంటామంతే,
నిన్ను నన్ను కలిపి మనం అని అనుకున్నాం అంటే ప్రపంచ జనాబ కలిపి మనిషితనం ఒక్కటే; - సిరివెన్నెల
Thursday, April 15, 2010
Neeli Megham nee lokam (నీలి మేఘం నీ లోకం)
నేల మూలాలు నా జగం
వేల మెరుపులు నీ సొంతం
వీలు కాదది పొందటం
జల్లై నీలి మేఘం నేల వడిలో చేరదా?
నీలో విరుపుకైనా దారి చూసే వీలుందా?
ఏమి అర్ధం కాని గుండె అద్దంలోని ఆశలేవో చూస్తున్నా
తేన కేరటాలున్న పాల సంద్రం ముందు ఈత రాదని అంటున్నా
నీలి మేఘం నీ లోకం
నేల మూలాలు నా జగం
బంగారంలా నవ్వే బొమ్మని, బొమ్మని చూసామని
సంతోషంతో తుల్లే కళ్లకి వేసెదేలా సంకెల్లని?
రెప్ప సంకెల్లు వెయ్యాలి అనుకున్నా
స్వప్న లోకంలో సందల్లు ఆగేనా?
స్వప్నం సత్యంగా ఇంకింత దగ్గరైన, దూరం అవుతావా తాకేంత వీలున్నా?
కోనేటిపై చందమామని చేయి తాకితే అది అందునా?
అరచేతిపై వున్నా గీతని చేయి తాకదా అవునా?
ఏమి అర్ధం కాని గుండె అద్దంలోని ఆశలేవో చూస్తున్నా
తేన కేరటాలున్న పాల సంద్రం ముందు ఈత రాదని అంటున్నా
తీరం నుండి ఎంతో హాయిగా కనిపించవా నది వంపులు
తీరం దాటామంటే మాయగా ముసిరేయ్యవా మరి ముంపులు
ఎంతో పంచేటి ఉదేశం వున్న మదికి
దేన్నీ ముంచేటి ఆవేశం రాదేన్నటికి
ఏదో అందించే ఆరాటంలోన వుంటే రారా రమంటూ ఆహ్వానం అందునంతే
చిరుగాలిని చిన్న దోసిలు బందిచదే ఓ ప్రాణమా?
నీ శ్వాశ లో కలిపేసుకో విడదీయటం తరమా?
ఏమి అర్ధం కాని గుండె అద్దంలోని ఆశలేవో చూస్తున్నా
తేన కేరటాలున్న పాల సంద్రం ముందు ఈత రాదని అంటున్నా
నీలి మేఘం నీ లోకం
నేల మూలాలు నా జగం
వేల మెరుపులు నీ సొంతం
వీలు కాదది పొందటం
Monday, March 22, 2010
Kundana Bomma (కుందన బొమ్మ)
నే రెప్ప వేయడం మరిచ..హే..
అయిన హే..ఏవో..హే..
కలలు ఆగవే తెలుసా..హే తెలుసా..
నా చూపు నీ బానిస..
నీలో నాలో..లోలో..
నుని వెచ్చనైనది మొ..
ఓఒ..ఓ..కుందన బొమ్మ..కుందన బొమ్మ
కుందన బొమ్మ..కుందన బొమ్మ..ఆ..హొ.ఓఒ...
కుందన బొమ్మ.. కుందన బొమ్మ..కుందన ..
కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..
కుందన బొమ్మ..నినె మరువదు ఈ జన్మ...
హొ ...ఓ...హొ..ఓ..ఓ...
నీ పాదం నడిచే ఈ చోట..ఓ..ఓ...
కాలం..కనువైన విందే అలలై పొంగిందే..
నీకన్నా నాకున్న..ఆ..
వరమింకేంటే... ఎదే .. ఆ...
ఓఒ..ఓఒ..ఓఒ..
వెన్నెల్లో వర్షంలా..
కన్నుల్లో చేరావు నువ్వే..
నన్నింక నన్నింక నువ్వే నా ఆణువణువూ గెలిచావే..
కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..ఆ..
హొ..ఓ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..
కుందన..కుందన బొమ్మ..
నువ్వే మనస్సుకి వెలుగమ్మ..
కుందన బొమ్మ..నిన్నే మరువదు ఈ జన్మ
Maragadha-thotti-lizh..
Malayaligal thaaraatumm,
Penn azhagaee..maathang-gal tohpugalil
Poonguyilugazh-inna-chernna,
Pullanguzhal-oothugai-yaana
Ninn-azhagaehhhh..Ninn-azhagae..
చల్లనైన మంటలో స్నానాలే చేయించావే..
ఆనందం అందించావే..
నీ మాట నీటిలో ముంచావే తెల్చావే..
తీరం మాత్రం దాచావెంటే..బొమ్మ..
కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..
కుందన బొమ్మ.. హొ...హొ...
కుందన బొమ్మ... కుందన బొమ్మ..కుందన...
కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి బొమ్మ...
కుందన బొమ్మ..నిన్నే మరువదు ఈ జన్మ..
కుందన బొమ్మ.. కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..హొ..ఓ..
కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన..
కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..
కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..హే..హే..
కుందన బొమ్మ..నిన్నే మరువదు(హే ..)ఈ జన్మ ..
కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..
Aakasham enthuntundho (ఆకాశం ఎంతుంటుందో)
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడు వెనకకి రాదే
హే నేస్తమని హింసించకిల
నీ ప్రేమలని ఊహించేనేల
హే నేస్తమని హింసించకిల
నీ ప్రేమలని ఊహించేనేల
ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుటుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రాణం చెప్పె మాటే వింటే, అన్ని నీకే అర్ధం కావా?
ఇష్టం వున్నా కష్టం అంటూ
నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా
ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చే వేల
నుంచో దూరంగా అన్న ఆశని కల్చేలా
ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చే వేల
నుంచో దూరంగా అన్న ఆశని కల్చేలా
ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుటుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడు వెనకకి రాదే
!!హే నేస్తమని హింసించకిల
నీ ప్రేమలని ఊహించేనేల(2)
Vintunnava (వింటున్నావా వింటున్నావా)
పెదవుల అంచులలో అనుచుకున్న
మౌనముతో నీ మదిని బందించా మనించు ప్రియ
తరిమే వరమ తాడిమే స్వరమ
ఇదిగో ఈ జన్మ నీదాని అంటున్న
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
తరిమే వరమ తాడిమే స్వరమ
ఇదిగో ఈ జన్మ నీదాని అంటున్న
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా బ్రతికుండగా నీ పిలుపును నేను విన్నా
ఓ బ్రతికుండగా నీ పిలుపును నేను విన్నా ..
ఏ మో ఏమో ఏమవుతుందో
ఏదెమైన నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇక పైన వింటున్నావా ప్రియ
గాలిలో తెల్ల కగితం లా నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా
తరిమే వరమ తాడిమే స్వరమ
ఇదిగో ఈ జన్మ నీదాని అంటున్న వింటున్నావా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
ఆద్యంతం ఏదో .. ఏదో... అనుభూతి
ఆద్యంతం ఏదో .. ఏదో... అనుభూతి అనవరగం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా ఇది వేనుకటిది
కాలం తోన పుట్టింది కాలంలా మారే మనస్సేలేనిది ప్రేమ
రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంట
నీదోనినై నిన్నే దాడి చేసుకుంట
ఎవరిని కాలువని చోటులలోన
ఎవరిని తలువని వేలలలోన
తరిమే వరమ తాడిమే స్వరమ
ఇదిగో ఈ జన్మ నీదాని అంటున్న వింటున్నావా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా ఆ
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా బ్రతికుండగా నీ పిలుపును నేను విన్నా
చాలు చాలే చెలియా చెలియా బ్రతికుండగా నీ పిలుపును నేను విన్నా
ఓ బ్రతికుండగా నీ పిలుపును నేను విన్నా ..
Swasai swaramai (శ్వాసై స్వరమై)
వెంటనేరా వెలుగైరా
నిజమయ్యే కలవైరా
నడిపించే అడుగైరా
నను చేరే నాతోరా
శ్వాసై స్వరమై సరదాలె పంచె సరిగమవై
వెంటనేరా వెలుగైరా
నిజమయ్యే కలవైరా
నడిపించే అడుగైరా
నను చేరే నాతోరా
శ్వాసై స్వరమై సరదాలె పంచె సరిగమవై
వెంటనేరా వెలుగైరా
ఊ.. ఊ.. ఊ.. ఊ..
వయసే నిన్నే మలచి వసంతమున కోకిలై తియ్యంగ కూసి
ఈ శిశిరంలోన మూగబోయి నన్నే చుస్తుందే జాలేసి
ఏమో ఏ మూలుందో చిగురించే క్షణమే
వెంటనేరా వెలుగైరా
నిజమయ్యే కలవైరా
నడిపించే అడుగైరా
నను చేరే నాతోరా
Tuesday, March 2, 2010
Hmm... Hmm...
“Ye Maya Chesave” a movie, which may remind some people of their lovers, better-halves and the memorable moments they would have spent with them. But for some others it will instill in their minds a feeling “Is love so beautiful?“ .
I sometimes tend to give equal importance to music as well as lyrics in a song. I have been spending last few days with this movie songs. The lyrics are so true and good and very neatly penned by Anant Sreeram, which explain the story a bit.
The music of these songs is so melodious and so touching. Though, I don’t understand the Malayalam bit of the song. The way of singing makes you feel the guy’s pain or hard feelings.
When I started watching this movie, I didn’t feel anything new or special as I have been with the film for quite some days. It makes you feel-good while watching the movie as it makes you feel-good while listening to the music. Though the climax can be guessed, the way of presenting it is superb. It shows how stronger the bond has developed between the lovers in their time of separation. The movie made my day.